అరటి ఆకులతో మొక్కల ట్రే
ఎకో ఫ్రెండ్లీ కవర్స్
మొక్కల్ని ప్లాస్టిక్ కవర్స్‌లో చుట్టి నర్సరీల్లో అమ్ముతారు. మొక్కలు పర్యావరణానికి మంచి చేస్తాయి. అంతవరకు ఓ.కే. కానీ, వాటికి వాడే ప్లాస్టిక్ కవర్స్ మాత్రం హాని చేస్తాయి. అందుకే విత్తనాల్ని నాటే ప్లాస్టిక్ కవర్స్, ట్రేలు కూడా ఎన్విరాన్మెంట్కి హాని చేయకూడదు అనుకున్నాడు కేరళకు చెందిన రిటైర్డ్ టీచర్ శశిధరన్. ఆకుల్లో విత్తనాలు నాటి, మొక్కలు పెంచే కొత్త ట్రెండ్ మొదలుపెట్టాడు.
నర్సరీ నుంచి తెచ్చుకున్న మొక్కలు నాటేటప్పుడు ప్లాస్టిక్ కవర్స్‌ను తీసి పడేస్తుంటారు. వీటివల్ల ప్లాస్టిక్ వ్యర్థాలు పెరుగుతుంటాయి. ఇది ఎన్విరాన్‌మెంట్‌కు హాని చేస్తుంది. అందుకే వీటిని కూడా ఎకోఫ్రెండ్లీగా తయారుచేస్తే బాగుంటుంది అనుకున్నాడు కేరళలోని కన్నూర్ జిల్లాకు చెందిన శశిధరన్.
ఆకులతో ట్రేలు
ఎకోఫ్రెండ్లీ ట్రేలను పూర్తిగా నేచురల్ ప్రొడక్ట్స్‌తోనే తయారు చేయాలనే ఆలోచన రాగానే, శశిధర్ మనసులో వచ్చిన ఫస్ట్ ఆప్షన్.. అరటి ఆకు. వీటిలోనే మట్టిపోసి, విత్తనాల్ని మొలకెత్తిస్తే బాగుంటుంది అనుకున్నాడు. వెంటనే అరటి ఆకులను కట్ చేసి, స్టాప్లర్ వాడి, ఒక ప్లాస్టిక్ కవర్‌లాగా తయారుచేశాడు. వీటిలోనే మట్టిపోసి, విత్తనాల్ని నాటాడు. నాలుగైదు రోజులకు అందులోంచి మొలకలు వచ్చాయి. ఆ మొక్కల్ని అలాగే తన ఇంట్లో నాటాడు. ఆ తర్వాత పామ్ చెట్టు ఆకులతో కూడా ఇలాగే చేశాడు. ఇందులో నాటిన విత్తనాలు కూడా మొక్కలుగా ఎదిగాయి. దీంతో అరటి ఆకులు, పామ్ చెట్టు ఆకులతో మొక్కలు పెంచే ట్రేలు తయారుచేయడం మొదలుపెట్టాడు. వీటినే ఇంట్లో కూడా నాటాడు. అవన్నీ బాగా పెరుగుతున్నాయి. అప్పటినుంచి ప్లాస్టిక్ కవర్స్‌లో చుట్టి ఉండే మొక్కల్ని కొనడం కాకుండా, ఇంట్లోనే ఎకోఫ్రెండ్లీ ట్రేలలో మొక్కలు పెంచుకుంటున్నాడు. ఎకోఫ్రెండ్లీ ట్రేలను తయారు చేయాలన్న తన ఆలోచన సక్సెస్ కావడమే కాకుండా, ఎంతోమందికి నచ్చింది. పామ్, అరటి ఆకుల్లోనే కాకుండా, ఎండు కొబ్బరి పీచులో కూడా మొక్కలు పెంచొచ్చు అంటున్న శశిధర్ ఈ మెథడ్‌లో సక్సెస్ కూడా సాధించాడు.
ట్రైనింగ్ ఇస్తా
‘‘ఈ ఎకోఫ్రెండ్లీ ట్రేలలో ఉండే మొక్కలు కావాలని చాలామంది అడుగుతున్నారు. ప్రస్తుతానికి వీటిని అమ్మకానికి పెట్టడంలేదు. కాకపోతే, అవసరమైనవాళ్లకు ఈ విషయంలో ట్రైనింగ్ ఇస్తా. టొమాటో, దోసకాయ, కాకర, మిర్చి, వంకాయ వంటి కూరగాయల్ని ఆకులతో తయారుచేసిన ట్రేలలోనే పెంచాను. వీటిని మా పెరట్లోనే నాటాను. ఆకులే కాబట్టి, భూమిలో కలిసిపోతాయి. ఎన్విరాన్‌మెంట్‌కు ఎలాంటి హాని ఉండదు. వీటిని ప్రస్తుతం అమ్మడం కుదరకపోయినా, తెలిసిన వాళ్లకు ఎలా తయారు చేయలో నేర్పిస్తా’’ అని చెప్తున్నాడాయన.
for more News….