- ఆన్లైన్లో సింగిల్ పెన్షన్ అప్లికేషన్ ఫారం
రిటైర్డ్ అవుతున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్..పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు సింగిల్ ఫెన్షన్ అప్లికేషన్ ఫారం6A ఆన్ లైన్ లో ( eHRMS 2.0లో) అందుబాటులో ఉంది. ఈ ఫారం ఉపయోగించి పెన్షన్ కు అప్లయ్ చేసుకోవచ్చు.
పదవీ విరమణ చేసే అధికారులు తన పెన్షన్ ప్రాసెస్ చేయడానికి Bhavishya /eHRMS ద్వారా ఫారం 6A ని సమర్పించాల్సి ఉంటుంది.ఈ కొత్త ఫారం 6A శనివారం(నవంబర్11,2024) నుంచి అమలులో ఉంటుంది. ఆన్ లైన్ పెన్షన్ అప్లికేషన్ విధానాన్ని సులభతరం చేయడం, దరఖాస్తుదారులకు పెన్షన్ సేవలను మరింత చేరువ చేసేందుకు లక్ష్యంగా కేంద్ర పెన్షనర్ల సంక్షేమ శాఖ పనిచేస్తుంది.
పెన్షన్ దరఖాస్తు ఫారం 6A నవంబర్ 16 నుంచి అమలు చేయబడుతుంది. ఈ అప్డేట్ ఫారం అవసరమైన మొత్తం సమాచారాన్ని ఒకే అప్లికేషన్ గా అందిస్తుంది. పదవీ విరమణ పొందిన ఉద్యోగుల నామినేటింగ్ ప్రయోజనాలకోసం ఫారం 6A ని ఉపయోగించుకోవచ్చు.
ఈ తాజా ఫారం.. మొత్తం 9 ఫారంలను కలిపి ఉంటుంది. ఫారం 6,8,4,3,A, ఫార్మాట్ 1, ఫార్మాట్ 9, FMA , జీరో ఆప్షన్ ఫారం అన్ని ఈ కొత్త ఫారం 6A లో ఉన్నాయి. CCS పెన్షన్ రూల్స్ 2021లోని 53,577,58,59 , 60 నియమాలకు అనుగుణంగా సవరణలు చేశారు.
ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..
నవంబర్6,2024 నుండి పదవీ విరమణ చేసే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఈ కొత్త సింగిల్ పెన్షన్ దరఖాస్తు ఫారమ్ 6-Aని e-HRMS 2.0లోని ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్ ద్వారా పూర్తి చేయాలి. ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణకు ముందు ఫారమ్ 6-A నింపడం ద్వారా వారి కుటుంబ వివరాలను అప్‌డేట్ చేయాలి. మినహాయింపు లేని పక్షంలో భవిష్య/ఇ-హెచ్‌ఆర్‌ఎంఎస్ ద్వారా పెన్షన్ కేసులు ఆన్‌లైన్‌లో ప్రాసెస్ చేయబడతాయి.
ఇ-హెచ్‌ఆర్‌ఎంఎస్‌ని ఉపయోగించి పదవీ విరమణ చేసే అధికారులు తప్పనిసరిగా సూపర్‌యాన్యుయేషన్ కేసుల కోసం ఫారమ్ 6-ఎని ఆన్‌లైన్‌లో సమర్పించాలి. అయితే సూపర్ యాన్యుయేషన్ కాని కేసుల కోసం ఇ-హెచ్‌ఆర్‌ఎంఎస్ ఉపయోగించని వారు Bhavishya ద్వారా ఫారమ్ 6-ఎని సమర్పించాల్సి ఉంటుంది. జీవిత భాగస్వామి లేదా కుటుంబ సభ్యులు ఫారం 6-A సమర్పించినట్లయితే ఉద్యోగులు వ్యక్తిగతంగా పెన్షన్ కమ్యుటేషన్ కోసం దరఖాస్తు చేసుకోవాలి.