ఇరిగేషన్ శాఖలో భారీగా రిటైర్మెంట్లు..లిస్టులో ఈఎన్​సీ అనిల్​ సహా 68 మంది

ఇరిగేషన్ శాఖలో భారీగా రిటైర్మెంట్లు..లిస్టులో ఈఎన్​సీ అనిల్​ సహా 68 మంది

హైదరాబాద్, వెలుగు: ఇరిగేషన్​ డిపార్ట్​మెంట్​లో వచ్చే ఏడాది భారీ సంఖ్యలో అధికారులు రిటైర్​ కాబోతున్నారు. ఈఎన్​సీ జనరల్​ అనిల్​ కుమార్, మరో ఈఎన్​సీ శంకర్​ సహా 68 మంది అధికారులు రిటైర్మెంట్​ లిస్టులో ఉన్నారు. రిటైర్​ అవుతున్న అధికారుల జాబితాతో శుక్రవారం ఇరిగేషన్​ శాఖ సెక్రటరీ రాహుల్​ బొజ్జా జీవో జారీ చేశారు. 61 ఏండ్లు నిండిన అధికారులు లిస్టులో పేర్కొన్న ప్రకారం రిటైర్​ అయిపోవాలని స్పష్టం చేశారు.

రిటైర్​ కాబోతున్న అధికారుల జాబితాలో ఏడుగురు సీఈలు, 15 మంది ఎస్ఈలు, 27 మంది ఈఈలు, 17 మంది డీఈఈలు ఉన్నారు. అయితే, ఇప్పటికే అధికారుల కొరతతో పనిభారంతో సతమతమవుతున్న డిపార్ట్​మెంట్​కు వచ్చే ఏడాది ఇంత మంది ఉన్నతాధికారులు రిటైర్​ అయితే మరింత భారం పెరుగుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రమోషన్లకు సంబంధించి ఇప్పటికే చాలా మంది అధికారులు ఉన్నతాధికారులకు వినతిపత్రం అందజేశారు. జోన్​ 6 ప్రమోషన్లకు సంబంధించి సుప్రీంకోర్టులో ఉన్న కేసు కూడా అడ్డంకిగా మారింది.