
ముంబై: బీజేపీలో నేతలు 75 ఏండ్లకు రిటైర్ కావాలనే నియమమేమీలేదని మహారాష్ట్ర బీజేపీ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ బవాన్ కులే తెలిపారు. మోదీ పదవీ కాలాన్ని నిర్ణయించేది ప్రజలేనని చెప్పారు. ప్రధాని మోదీ తన రిటైర్ మెంట్ గురించి తెలియజేయడానికి ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్స్‌కు వెళ్లారని శివసేన నేత సంజయ్ రౌత్ చేసిన వ్యాఖ్యలను ఆయన తోసిపుచ్చారు.
ఈమేరకు మంగళవారం (April 1) ‘ఎక్స్’ లో ఆయన పోస్ట్ పెట్టారు. ‘‘వాజ్ పేయి 79 ఏండ్ల వరకు, మొరార్జీ దేశాయ్ (83), మన్మోహన్ (81) కూడా 75 ఏండ్లు దాటిన తర్వాత కూడా ఆ పదవిలో ఉన్నారు. సంజయ్ రౌత్ దీనిని మరచిపోయినట్టున్నారు’’ అని బవాన్కులే అన్నారు.