ఓటమితో నడాల్ వీడ్కోలు

ఓటమితో నడాల్ వీడ్కోలు

మలాగ (స్పెయిన్‌‌‌‌) : టెన్నిస్ చరిత్రలో ఓ సువర్ణాధ్యాయం ముగిసింది.  స్పెయిన్‌‌‌‌ బుల్‌‌‌‌ రఫెల్ నడాల్ స్వదేశంలో.. సొంత అభిమానుల కేరింతల నడుమ తన నేషనల్ టీమ్ తరఫున ఆఖరాట ఆడేశాడు.  నెదర్లాండ్స్‌‌‌‌, స్పెయిన్ జట్ల మధ్య డేవిస్ కప్‌‌‌‌ క్వార్టర్ ఫైనల్లో భాగంగా మంగళవారం రాత్రి జరిగిన తొలి సింగిల్స్‌‌‌‌లో 38 ఏండ్ల నడాల్‌‌‌‌ 4–6, 4–6   తేడాతో తన ప్రత్యర్థి, 80 ర్యాంకర్‌‌‌‌‌‌‌‌ బోటిక్‌‌‌‌ చేతిలో ఓడి కెరీర్‌‌‌‌‌‌‌‌కు వీడ్కోలు పలికాడు.  క్వార్టర్ ఫైనల్‌‌‌‌కు గంట ముందు నడాల్‌‌‌‌ తొలి సింగిల్స్‌‌‌‌లో పోటీ పడతాడని స్పెయిన్‌‌‌‌ టీమ్‌‌‌‌  ప్రకటించింది. 

పోటీకి ముందు స్పెయిన్ జాతీయ గీతం వినిపిస్తున్న సమయంలో రఫా తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. ఇక కిక్కిరిసిన స్టేడియంలో అభిమానుల చప్పట్ల నడుమ కోర్టులోకి వచ్చిన నడాల్ తొలుత బోటిక్‌‌‌‌తో దీటుగా తలపడ్డాడు. ఇద్దరూ చెరో గేమ్ నెగ్గుతూ వెళ్లారు. కానీ, తొమ్మిదో గేమ్‌‌‌‌లో నడాల్ సర్వీస్‌‌‌‌ బ్రేక్‌‌‌‌ చేసిన బోటిక్‌‌‌‌ ఆపై సర్వీస్ నిలబెట్టుకొని సెట్ నెగ్గాడు. రెండో సెట్‌‌‌‌లోనూ బోటిక్ జోరు నడిచింది. తొలి, ఐదో గేమ్స్‌‌‌‌లో నడాల్‌‌‌‌ సర్వీస్ బ్రేక్‌‌‌‌ చేసి 4–1తో ఆధిక్యంలో నిలిచాడు. ఈ దశలో అద్భుతమైన ఆటతో ఫ్యాన్స్‌‌‌‌కు కిక్‌‌‌‌ ఇచ్చిన నడాల్ 4–5తో పోటీలోకి వచ్చాడు. 

కానీ, తన సర్వీస్‌‌‌‌లో పదో గేమ్‌‌‌‌ నెగ్గిన బోటిక్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌ ముగించాడు.  రెండు దశాబ్దాల అద్భుతమైన కెరీర్‌‌‌‌‌‌‌‌లో నడాల్ 22 గ్రాండ్‌‌‌‌స్లామ్స్ నెగ్గాడు. ఇందులో 14 ఫ్రెంచ్ ఓపెన్‌‌‌‌ టైటిళ్లతో రికార్డు సృష్టించాడు. యూఎస్‌‌‌‌ ఓపెన్‌‌‌‌లో నాలుగుసార్లు, వింబుల్డన్, ఆస్ట్రేలియన్ ఓపెన్‌‌‌‌లో రెండేసిసార్లు చాంపియన్‌‌‌‌గా నిలిచాడు. నొవాక్ జొకోవిచ్ (24) తర్వాత మెన్స్‌‌‌‌ సింగిల్స్‌‌‌‌లో అత్యధిక గ్రాండ్‌‌‌‌స్లామ్స్ నెగ్గిన రెండో ప్లేయర్‌‌‌‌‌‌‌‌గా నిలిచాడు. ఒలింపిక్స్‌‌‌‌లో సింగిల్స్‌‌‌‌, డబుల్స్‌‌‌‌లో గోల్డ్ మెడల్స్ కూడా అందుకున్న రఫా తన కెరీర్‌‌‌‌‌‌‌‌లో మొత్తంగా 92 సింగిల్స్‌‌‌‌ టైటిల్ గెలుచుకున్నాడు. 209 వారాల పాటు వరల్డ్‌‌‌‌ నంబర్ ర్యాంక్‌‌‌‌లో ఉన్నాడు.