
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ రెట్రో (Retro). ప్రముఖ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహిస్తున్న సినిమా మే 1న పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా రెట్రో మూవీ తెలుగు రాష్ట్రాల డిస్ట్రీబ్యూషన్ హక్కులను ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ దక్కించుకుంది.
ఈ మేరకు X వేదికగా నిర్మాత నాగ వంశీ అధికారికంగా ప్రకటించారు. " అద్భుతాలు సృష్టించబోతున్న వ్యక్తి కోసం మేము ఎదురుచూస్తున్నాము.. రెట్రో తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కులను మేము పొందామని ప్రకటించడానికి మాకు చాలా ఆనందంగా ఉందని" నాగ వంశీ ట్వీట్ చేశాడు.
We are here for the ONE
— Naga Vamsi (@vamsi84) February 27, 2025
Who’s set to create wonders ❤️🔥
We are super stoked to announce that we have acquired the Telugu States' theatrical rights for #RetroTelugu! 💥#RetroFromMay1 #LoveLaughterWar@Suriya_Offl #Jyotika @karthiksubbaraj @hegdepooja @Music_Santhosh… pic.twitter.com/Ynt0AlZ8Yv
హీరో సూర్యకు తమిళం తర్వాత తెలుగులో మంచి క్రేజ్ ఉంది. సినిమాకు కొంచెం పాజిటివ్ టాక్ వచ్చిన తెలుగు మార్కెట్ కుదేల్ అవ్వాల్సిందే. ఎందుకంటే, హీరో సూర్య నటించిన తెలుగు డబ్బింగ్ తమిళ సినిమాలు ఒరిజినల్ సినిమాలకంటే ఎక్కువ వసూళ్లు చేస్తాయి.
రెట్రో పంపిణీదారుల జాబితా:
ఆంధ్రప్రదేశ్+తెలంగాణ - సితార ఎంటర్‌టైన్‌మెంట్స్
తమిళనాడు -శక్తి ఫిల్మ్ ఫ్యాక్టరీ
ఓవర్సీస్ - AP ఇంటర్నేషనల్
సింగపూర్ - హోమ్ స్క్రీన్ ఎంటర్‌టైన్‌మెంట్
UK - బోలీన్ సినిమా
ఇకపోతే ఈ సినిమా సక్సెస్ సూర్యకు చాలా ఇంపార్టెంట్. గత చిత్రం కంగువతో భారీ డిజాస్టర్ అందుకుంది. దాంతో ఈసారి హీరో సూర్య స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నాడు. అందుకు తగ్గట్టే ఇటీవలే ఈ మూవీ ఫస్ట్ గ్లింప్స్ రిలీజై అంచనాలు పెంచేసేంది. మరి రెట్రోతో సూర్య ఎలాంటి విజయం అందుకోనున్నాడో చూడాలి.
ఇక ఈ సినిమా క్యాస్ట్ & క్రూ విషయానికొస్తే సూర్యకి జంటగా స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే నటిస్తోంది. జోజు జార్జ్, జయరామ్, కరుణాకరన్ తదితరులు ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు. 2D ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ పై జ్యోతిక సూర్య కలసి నిర్మిస్తున్నారు. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నాడు.