టాలీవుడ్ స్టార్ హీరో సినిమాలో ఆఫర్ దక్కించుకున్న మలయాళ యంగ్ బ్యూటీ..

టాలీవుడ్ స్టార్ హీరో సినిమాలో ఆఫర్ దక్కించుకున్న మలయాళ యంగ్ బ్యూటీ..

తెలుగులో ఇటీవలే రిలీజ్ అయిన రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ సినిమా సూపర్ హిట్ అయ్యింది.  ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన మలయాళ యంగ్ బ్యూటిప్ల్ హీరోయిన్ "కయదు లోహర్" డైలాగ్స్, డ్యాన్స్, నటనతో టాలెంట్ ప్రూవ్ చేసుకుంది. దీంతో తెలుగు, మలయాళ భాషల్లో ఆఫర్లు బాగానే క్యూ కడుతున్నట్లు సమాచారం.

అయితే తెలుగులో ప్రముఖ డైరెక్టర్ అనుదీప్ కెవి దర్శకత్వం వహిస్తున్న లేటెస్ట్ సినిమా "ఫంకీ". ఈ సినిమాని  రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ జోనర్ లో తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో హీరో విశ్వక్ సేన్ హీరోగా నటిస్తుండగా హీరోయిన్ గా కయదు లోహర్ ని సెలక్ట్ చేసినట్లు సమాచారం. ఇప్పటికే ఈ సినిమాకి సంబందించిన పలు కీలకమైన షెడ్యూల్స్ ని మేకర్స్ కంప్లీట్ చేశారు. కానీ విశ్వక్ ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉండటంతో ఫంకీ సినిమా షూటింగ్ కి గ్యాప్ ఇచ్చారు.

ఈ విషయం ఇలా ఉండగా హీరో విశ్వక్ సేన్ నటించిన లైలా సినిమా ఫ్లాప్ అయ్యింది. దీంతో ఫంకీ సినిమాతో హిట్ కొట్టాలని బాగానే శ్రమిస్తున్నాడు. ఇక ఈ సినిమా ఇతర అండ్ క్రూ విషయానికొస్తే  యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా సురేష్ సారంగం సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగ వంశీ మరియు సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.