మూవీ రివ్యూ: ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్‌’.. ఒకేసారి 48 సబ్జెక్టులు పాసయ్యాడా..?

మూవీ రివ్యూ:  ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్‌’.. ఒకేసారి 48 సబ్జెక్టులు పాసయ్యాడా..?
తమిళ్ హీరో, డైరెక్టర్ ఆ మధ్య నటించిన లవ్ టుడే సినిమా టాలీవుడ్ లో సూపర్ హిట్ అయ్యింది. దీంతో ఈసారి ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్‌’   అనే సినిమాతో అలరించడానికి ఆడియన్స్ ముందుకొచ్చాడు. ఇప్పడు చిత్ర విశేషాలేంటో చూద్దాం.. 

కథ: డి.రాఘవన్(ప్రదీప్ రంగనాధన్) బీటెక్ వరకూ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. కానీ బీటెక్ లో జాయిన్ అయిన తర్వాత లవ్, ఫ్రెండ్స్ అంటూ తిరుగుతూ కనీసం ఒక్క సబ్జెక్టు కూడా పాస్ కాకుండా 48 అరియర్స్ పెట్టుకుంటాడు. అయితే కాలేజీ లైఫ్ కీర్తి (అనుపమ పరమేశ్వరన్) తో ప్రేమలో పడతాడు. ఈ లవ్ కూడా పెద్దగా వర్కౌట్ అవదు. కానీ బీటెక్ తర్వాత సాఫ్ట్వేర్ ఉద్యోగం తెచ్చుకుని లైఫ్ లీడ్ చేస్తుంటాడు. ఆతర్వాత రాఘవన్ లైఫ్ లోకి పల్లవి (కాయాదు) వస్తుంది. దీంతో మళ్ళీ లవ్ ట్రాక్ మొదలై పెళ్లి వరకూ వెళ్తుంది. కానీ కొన్ని ట్విస్టులు ఎదురవుతాయి.. చివరికి రాఘవన్ లైఫ్ లో ఏం జరిగింది..? ట్విస్టులు ఏంటనేది తెలియాలంటే తెరపై చూడాల్సిందే.

విశ్లేషణ:  ఇపుడున్న యూత్ ట్రెండ్ కి తగట్టుగా రాసి తీసిన సన్నివేశాలు బాగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా హీరో ప్రదీప్ రంగనాథ్ కాలేజ్ స్టూడెంట్ గా, ఫ్రస్ట్రేటేడ్ యాప్ట్ ఎంప్లాయ్ పాత్రలో చక్కగా ఒదిగిపోయాడు. ఈ సినిమాలో అక్కడక్కడా లవ్ టుడే సినిమా ఛాయలు కూడా కనిపిస్తాయి.  హీరో ప్రదీప్ రంగనాథన్ క్యారెక్టర్ ను ఎస్టాబ్లిష్ చేసిన విధానం ఎక్సలెంట్ అని చెప్పవచ్చు. ఇక హీరోయిన్లు కాయదు, అనుపమ పరమేశ్వరన్ కూడా ఆకట్టుకున్నారు. ముఖ్యంగా అనుపమని రొమాంటిక్ యాంగిల్ లో  చూపించిన విధానం బాగుంది. అలాగే కాలేజీ బ్యాక్ డ్రాప్ లో జరిగే లవ్ స్టోరీ కూడా ఆకట్టుకుంటుంది.

ALSO READ | హరిహర వీరమల్లు సెకెండ్ సింగిల్ ప్రోమో అదుర్స్.. ఫుల్ సాంగ్ కోసం వెయిటింగ్..

ఇక సెకెండాఫ్ విషయానికొస్తే  అనుకోని ట్విస్టులు ఆసక్తిని పెంచుతాయి. ముఖ్యంగా హీరో, కాలేజీ ప్రిన్సిపాల్ మధ్యన సాగే సన్నివేశాలు కడుపుబ్బా నవ్విస్తాయి. ఆ ఆతర్వాత కొన్ని సీన్స్ లో ల్యాగ్ ఉండటంతో బోర్ కొట్టినట్లు అనిపిస్తుంది.  చివరిలో మంచి మెసేజ్ ఇచ్చే ప్రయత్నం పెద్దగా వర్కౌట్ అవలేదు. దీంతో దర్శకుడు  క్లైమాక్స్ పై దృష్టి సారించి ఉంటె బాగుండేందని అనిపిస్తుంది.
 
సాంకేతిక నిపుణుల పని తీరు: ఓరి దేవుడా సినిమాతో మంచి లవ్ స్టోరీని అందించిన డైరెక్టర్ అశ్వత్ మారిముత్తు ఈసారి యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ని ఎంచుకున్నాడు. కథకి తగ్గట్టుగా క్యాస్ట్ అండ్ క్రూ ఎంపికలో సరైన నిర్ణయాలు తీసుకోవడంతో అక్కడే దాదాపుగా సక్సెస్ అయ్యాడు. ఇక ఎమోషన్స్ తగ్గట్టుగా నటీనటుల ఫెరఫార్మెన్స్, స్క్రీన్ ప్లే, మేకింగ్ అంత బాగుండటంతో యూత్ ఎంగేజ్ చేయడంలో సక్సెస్ చెయ్యడని చెప్పవచ్చు. 

మ్యూజిక్ డైరెక్టర్ లియోన్‌ జేమ్స్‌ అందించిన సాంగ్స్ పెద్దగా వర్కౌట్ కాకపోయినప్పటికీ కొన్ని సన్నివేశాల్లో ఇచ్చిన బీజియం బాగానే వర్కౌట్ అయ్యిందని చెప్పవచ్చు. ఎమోషనల్ సీన్స్ కి లియోన్‌ జేమ్స్‌ బీజయం ఊపిరి పోసింది.  ఇక ఎడిటింగ్ విషయానికి వస్తే.. ప్రదీప్ ఈ రాఘవ్ సెకెండాఫ్ లో కొన్ని సీన్స్ కి కత్తెర పెట్టాల్సింది.. దీంతో ల్యాగ్ తగ్గి బోర్ కొట్టకుండా ఉండేది. ఓవరాల్ గా చూస్తే యూత్ ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈ చిత్రం ఎటువంటి అంచనాలు లేకుండా వెళితే మంచి ఫన్ ని ఎంజాయ్ చేస్తారు. అలాగే లవ్ టుడే అంచనాలు పెట్టుకునే ఈ సినిమాకి వెళితే మాత్రం కొంతమేర నిరాశ తప్పదు.