ఒకప్పుడు కో స్టార్స్.. ఇప్పుడు ఎంపీలు..

ఒకప్పుడు కో స్టార్స్.. ఇప్పుడు ఎంపీలు..

ఒకప్పుడు సినిమాలో కలిసి హీరో హీరోయిన్లుగా నటించిన కంగనా రనౌత్, చిరాగ్ పాశ్వాన్ లు ఇప్పుడు పార్లమెంటులో ఎంపీలుగా కలిశారు.2011లో మిలే నా మిలే హమ్ సినిమాలో కలిసి నటించిన ఈ ఇద్దరు 2024 ఎన్నికల్లో పోటీ చేసి ఎంపీలుగా గెలుపుపొందారు. ఈ బాలీవుడ్ స్టార్స్ పార్లమెంట్ కలిసిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 2011 తర్వాత కంగనా స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకోగా, చిరాగ్ మాత్రం తండ్రి చాటు బిడ్డగానే మిగిలిపోయారు.

చిరాగ్ పాశ్వాన్ ఎల్ జేపీ తరపున హిజాపూర్ నుండి ఎంపీగా గెలుపొంది, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రిగా మోడీ క్యాబినెట్లో చోటు దక్కించుకున్నారు. చిరాగ్ తండ్రి రామ్ విలాస్ హిజాపూర్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.కంగనా హైమాచల్ ప్రదేశ్ లోని మండి నుండి తొలిసారి ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు.మంత్రి విక్రమాదిత్యపై 75వేల మెజారిటీతో గెలుపొంది సంచలనం సృష్టించారు.