
అస్సాం సిఎం హిమంత బిశ్వ శర్మ రాహుల్ గాంధీపై చేసిన వాఖ్యలు సభ్యసమాజం సిగ్గుపడేలా ఉన్నాయన్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. బీజేపీ ఆయనను సీఎం పదవి నుంచి తొలగించాలన్నారు. రాహుల్ గాంధీపై హిమంత బిశ్వ శర్మ వాఖ్యలపై రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చారు రేవంత్. రేపు తెలంగాణలోని అన్ని పోలీస్ స్టేషన్ లలో హిమంత బిశ్వ శర్మపై ఫిర్యాదు చేస్తామన్నారు. సిఎం కేసీఆర్ మాటల్లో చిత్తశుద్ధి ఉంటే హిమంత బిశ్వ శర్మపై కేసులు నమోదు చేయించి అరెస్ట్ చేయించాలన్నారు.
అస్సాం సీఎం వ్యాఖ్యలపై మోడీ, అమిత్ షా,నడ్డాలు ఇప్పటి వరకు స్పందించక పోవడం దారుణమన్నారు. భారత్ మాతాకి జై అనే బీజేపీ భారత మాతను అవమానించేలా మాట్లాడారన్నారు. బీజేపీ నేతలది చైనా, పాకిస్తాన్ డీఎన్ఏ అని తామంటే సంస్కారమేనా అని ప్రశ్నించారు. హిమంత బిశ్వ శర్మ చైనా వాడికి పుట్టాడంటే మీకు ఎలా ఉంటుందన్నారు రేవంత్.