కరీంనగర్: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హాత్ సే హాత్ జోడో యాత్ర కరీంనగర్ జిల్లాలో కొనసాగుతోంది. అందులో భాగంగా జమ్మికుంట మండలం బిజిగిరి షరీఫ్ దర్గాను సందర్శించిన రేవంత్ రెడ్డి దర్గా ఆచారం ప్రకారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూలచాదర్ సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, స్థానిక కాంగ్రెస్ పార్టీ నేతలు పాల్గొన్నారు.