పేదోడు, పేద్దోడు బిర్యానీ తింటున్రు అంటే కాంగ్రెస్సే కారణం : రేవంత్ రెడ్డి

ఇవాళ పేదోడు, పేద్దోడు బిర్యానీ తింటున్రు అంటే దానికి కారణం కాంగ్రెస్ అని అన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.  1960 లో కరవొచ్చినప్పుడు పేదోడు, పేద్దోడు అందరూ మన్ను తినే బ్రతికారని, ఎవ్వరికి కూడా తిండిలేదన్నారు.  అప్పుడు కాంగ్రెస్ తీసుకు వచ్చిన హరిత విప్లవంతో ప్రతి పేదవాడు బిర్యానీ తినే స్థాయికి వచ్చారన్నారు. 

కాంగ్రెస్ సిద్ధాంతాన్ని, విధానాన్ని పేద ప్రజలకు అందుబాటులోకి తీసుకు వెళ్లడానికి తాను పనిచేస్తున్నానని రేవంత్ రెడ్డి అన్నారు.  తాను క్రమశిక్షణ కలిగిన కాంగ్రెస్ కార్యకర్తనని చెప్పుకొచ్చారు.  తాను లేవనెత్తిన అంశాలపై మాట్లాడకుండా చేసిన దోపడిని తప్పి పుచ్చుకోవడానికి బీఆర్ఎస్ నాయకులు ప్రయత్నం చేస్తున్నారని రేవంత్ ఆరోపించారు.