దొర గడీలో చేరాక పౌరుషం చచ్చిపోయిందా?: రేవంత్

దొర గడీలో చేరాక పౌరుషం చచ్చిపోయిందా?: రేవంత్

కడియం శ్రీహరి, తాటి కొండ రాజయ్య దొరగడీలో చేరాక పాము కంటే హీనంగా బానిస బతులయ్యాయని  టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శించారు. విద్య విలువ తెలిసిన కడియం శ్రీహరి  స్టేషన్ ఘన్ పూర్ కు ఒక్క డిగ్రీ కాలేజీ కూడా తేలేకపోయారని ఆరోపించారు.   ఒకప్పుడు ఆత్మగౌరవంతో బతికిన కడియం శ్రీహరికి దొరగడీలో  ఇంత అవమానం అవసరామా ? అని ప్రశ్నించారు.  కడియంలో  మాదిగ బిడ్డల పౌరుషం చచ్చిపోయిందా? లేక పదవుల కోసం తాకట్టు పెట్టారా? అని ప్రశ్నించారు.

ఉపముఖ్యమంత్రిగా రాజయ్య భర్తరఫ్ తెలంగాణ చరిత్రలో ఒక మాయని మచ్చ అని  రేవంత్ అన్నారు. దళితులంటే  చిన్నచూపున్న కేసీఆర్..  అవినీతి ఆరోపణల పేరుతో రాజయ్యను పదవి నుంచి  తొలగించారని ఆరోపించారు. రాజయ్య నిజంగా అవినీతి చేసి ఉంటే ఎందుకు భయటపెట్టలేదన్నారు. దొర దొడ్లో రాజయ్యకు  ఘోర అవమానం జరిగిందన్నారు. వరంగల్ కు  వైద్య విధాన పరిషత్ తెస్తానన్న రాజయ్య సొంత నియోజకవర్గానికి వంద పడకల ఆస్పత్రి తేలేకపోయారని విమర్శించారు.రాజయ్యకు రాజకీయ భిక్ష పెట్టింది కాంగ్రెస్సేనన్నారు. రాజయ్య పంచెకట్టు కాంగ్రెస్ లో చెల్లింది కానీ.. దొర గడీలో చెల్లలేదని రేవంత్ అన్నారు.