మంత్రి కేటీఆర్ అవినీతికి కేరాఫ్ కాళేశ్వరం 9 వ ప్యాకేజీ పనులని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. కేటీఆర్ ఉద్యమ కారుడైతే వందల ఎకరాల భూములు, పత్రికలు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. అమెరికాలో బాత్రూంలు కడిగే కేటీఆర్ ..ఉద్యమ కారుడు ఎలా అవుతారని అన్నారు. తెలంగాణ కోసం త్యాగం చేసిన కుటుంబాలకు బుక్కెడు తిండి పెట్టలేదు కానీ..పార్టీ ఫిరాయించిన సన్నాసులకు పదవులిచ్చారని విమర్శించారు. తెలంగాణ ప్రజలు కేటీఆర్ కుటుంబ సభ్యులైతే..పేద ప్రజలను ప్రగతి భవన్ లోకి రానిచ్చి వారి సమస్యలు వినాలని సూచించారు.
సిరిసిల్లలో నేతన్నల, గీతన్నల తలరాత మారడం లేదని రేవంత్ రెడ్డి అన్నారు. ల్యాండ్ మాఫియా, ఇసుక మాఫియాకి తోడు నేతన్నలను మాఫియా చేస్తుండని ధ్వజమెత్తారు. కల్వకుంట్ల కుటుంబాన్ని తెలంగాణ నుంచి తరిమికొట్టాలన్నారు. ఎందరో త్యాగం చేసిన తెలంగాణను కల్వకుంట్ల కుటుంబం ఆక్రమించిందని ఆరోపించారు. కొండా లక్ష్మణ్ బాపూజీ కాళ్లు మొక్కిన కేసీఆర్ ఆయనకే ద్రోహం చేశారని విమర్శించారు. కారులో పెట్రోలో పోసిన కేకే మహేందర్ రెడ్డిని పక్కన పెట్టి.. కేసీఆర్ తన కొడుక్కు టికెట్ ఇచ్చిండని విమర్శించారు. 2009 కంటే ముందు కేటీఆర్ కు సిరిసిల్ల అంటే ఏం తెలుసని ప్రశ్నించారు.