
- ఎంఐఎం నేత అసదుద్దీన్ పై ఐదు
- తలసాని సాయికిరణ్ పై ఆరు కేసులు
- చేవెళ్ల అభ్యర్థులపై కేసులు నిల్
లోక్‌సభ ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు నామినేషన్ల సమర్పణలో భాగంగా అందజేసిన అఫిడవిట్ల ప్రకారం గ్రేటర్ పరిధిలోని పార్టీలలో నేర చరిత్ర కలిగిన క్యాండిడేట్స్ ఉన్నారు. ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీల అభ్యర్థులపై కేసులున్నాయి. హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల స్థానాలలో బరిలో ఉన్న ప్రధాన పార్టీల అభ్యర్థులలో చేవెళ్ల బరిలో నిలిచిన ఏ ఒక్క అభ్యర్థిపై కూడా ఎలాంటి కేసులు లేవు. ప్రధానంగా.. మాల్కాజిగిరి లోకసభ సీటు నుంచి కాంగ్రెస్ తరఫున బరిలోఉన్న రేవంత్‌రెడ్డిపై 42 కేసులు నమోదై ఉన్నాయి. తెలంగాణ వ్యాప్తంగా లోక్ సభ బరిలో నిలిచి నఅభ్యర్థు ల కేసులలో ఈయన రెండో వ్యక్తి గానిలవడం గమనార్హం.
అలాగే హైదరాబాద్ నుంచి పోటీ చేస్తున్న మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీపై ఐదు కేసులు ఉన్నాయి. బిహార్, మహారాష్ట్ర, తెలంగాణలో ఆయా కేసులు నమోదు అయ్యాయి. ఇందులో ఒక కేసు తొమ్మిదేళ్ల నుంచి పెండింగ్‌లోనే ఉంది. ఇదే స్థానం నుంచి బరిలోఉన్నబీజేపీ అభ్యర్థి డాక్టర్ భగవంతరావుపై మూడు కేసులు ఉన్నాయి. సికింద్రాబాద్ నుంచి మొదటిసారి పోటీ చేస్తున్న టీఆర్ఎస్ అభ్యర్థి తలసాని సాయికిరణ్ యాదవ్ పై ఆరు కేసులు ఉన్నాయి. నామినేషన్ సందర్భంగా అభ్యర్థులు దాఖలు చేస్తున్న అఫిడవిట్ 6(ఎ) ప్రకారం ప్రతి అభ్యర్థి తనపై ఉన్న కేసులు వాటి పూర్తి వివరాలుసంబంధిత పార్టీకి తెలపాల్సి ఉంది. అభ్యర్థులు కేసు వివరాలు తెలిపిన తరువాత రాజకీయ పార్టీలు వారికి ‘బి’ ఫాం ఎందుకు ఇచ్చాయని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రతినిధులు ప్రశ్నిస్తున్నారు. ఇది ఆయా పార్టీల నీతి నిజాయతీని తెలియజేస్తుందంటున్నారు. ప్రస్తుత రాజకీయ పార్టీలు నేరచరిత్రను కాదని గెలుపు గుర్రాలను ఎంచుకుంటున్నాయని ఆరోపించారు.