నల్లగొండ జిల్లా : ఎన్నికల ప్రచారంతో వేడెక్కిన మునుగోడులో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఇవాళ కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి.. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ ఎదురుపడ్డారు. ఈసందర్భంగా వారిద్దరు ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. స్నేహపూర్వకంగా మాట్లాడుకున్నారు.
అన్ని రాజకీయ పార్టీల ఎన్నికల ప్రచారంతో మునుగోడు హీటెక్కింది. నియోజకవర్గం పరిధిలోని ఊరూవాడ రాజకీయ కోలాహలాన్ని సంతరించుకున్నాయి. ఎన్నికల ప్రచారం నిర్వహించే క్రమంలో ఈవిధంగా వేర్వేరు పార్టీల ముఖ్య నాయకులు అరుదుగా ఎదురుపడుతుంటారు.