మహిళల అండర్-19 వరల్డ్ కప్ గెలుపులో కీలక పాత్ర పోషించిన భద్రాచలం బిడ్డ గొంగడి త్రిషకు అభినందలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు రాజకీయ నాయకులు త్రిషను అభినందిస్తూ పోస్టులు పెడుతున్నారు. లేటెస్ట్ గా కాంగ్రెస్ తెలంగాణ చీఫ్ రేవంత్ రెడ్డి త్రిషను అభినందిస్తూ ట్వీట్ చేశారు.‘ మన మట్టిలో పుట్టిన మరో ఆణిముత్యం. విశ్వ క్రీడా వేదికపై భారత కీర్తి పతాకాను ఎగరేసిన భద్రాద్రి రామ బాణం. లక్షలాది యువ తరంగాలకు మరో స్ఫూర్తిగీతం.మహిళల అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్ లో భారత జట్టును విశ్వ విజేతగా నిలిపిన తెలంగాణ బిడ్డ గొంగడి త్రిషకు శుభాభినందనలు’’ అంటూ కొనియాడారు.
ఆదివారం జరిగిన అండర్ 19 వరల్డ్ కప్ లో ఇంగ్లాండ్ తో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో 69 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన టీమిండియా 3 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి కష్టకాలంలో పడింది. అపుడు తెలుగు అమ్మాయి గొంగడి త్రిష 24, సౌమ్య తివారితో( 24)కలిసి చివరి వరకు ఉండి ఇండియాను గెలిపించారు. టోర్నీలో ఫ్లేయర్ ఆఫ్ ది సిరీస్ గెలుచుకుంది.