తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డిని ఎంపిక చేసింది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం. రెండు రోజుల ఉత్కంఠకు తెర దించుతూ.. రేవంత్ రెడ్డి వైపే మొగ్గు చూపింది పార్టీ హైకమాండ్. ఢిల్లీలో కాంగ్రెస్ హైకమాండ్ మీటింగ్ లో ఏఐసీసీ పరిశీలకులతోపాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్కలతో చర్చించిన అధిష్టానం.. సీఎంగా రేవంత్ రెడ్డిని ఫైనల్ చేసింది. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కూడా రేవంత్ రెడ్డి వైపే మొగ్గు చూపారు. హైకమాండ్ నిర్ణయాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు తెలియజేసిన ఏఐసీసీ పరిశీలకులు.. తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తారని ప్రకటించారు. 

రేవంత్ రెడ్డి సీఎంగా.. 2023, డిసెంబర్ 7వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 7వ తేదీ, గురువారం మంచి మూహూర్తం ఉండటంతో.. ఆ రోజే అంటోంది పార్టీ. ఇప్పటికే రాజ్ భవన్ లో ఏర్పాట్లు పూర్తి చేశారు. కొత్త సీఎం కాన్వాయ్ రెడీగానే ఉంది. ఇక రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం మాత్రమే మిగిలి ఉంది. 

రేవంత్ రెడ్డితోపాటు ఎవరెవరు ప్రమాణ స్వీకారం చేస్తారనేది ఆసక్తిగా మారింది.