కేసీఆర్ నుంచి తెలంగాణకు విముక్తి కలిగించాలి

కేసీఆర్ నుంచి తెలంగాణకు విముక్తి కలిగించాలి

తెలంగాణ కేసీఆర్ కుటుంబం చేతిలో బందీ అయ్యిందన్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. సీఎం కొడుకు, అల్లుడు, బిడ్డ, బంధువులు వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకా కేసీఆర్ అవినీతిపై విచారణ చేయించి జైల్లో వేద్దామన్నారు. అమెరికాలోని డల్లాస్ లో జరిగిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు. NRI కాంగ్రెస్ ఆధ్వర్యంలో వాహనాల ర్యాలీ తీశారు. ఆ తర్వాత జరిగిన పలు కార్యక్రమాల్లో ఇద్దరు కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన రేవంత్.. తల తెగి పడ్డా వెనకడుగు వెయ్యబోనని.. తమతో  కలిసి రావాలని..  తెలంగాణ వాసులకు పిలుపునిచ్చారు.

రాబోయే ఎన్నికలలో మీరు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాలని కోరారు.  కేసీఆర్ నుంచి తెలంగాణకు విముక్తి కలిగించి తెలంగాణకు మంచి రోజులు తెచ్చే బాధ్యత తమదేనన్నారు. 60 ఏళ్ళు తెలంగాణలో అన్ని వనరులు అభివృద్ధి చేస్తే.. కేసీఆర్ కుటుంబం అన్నింటినీ దోచుకుందన్నారు. తెలంగాణ ఏ లక్ష్యం కోసమైతే తెచుకున్నామో ఇప్పుడు ఆ అలక్ష్యం నెరవేరడం లేదన్నారు.