కోల్‌బెల్ట్, వెలుగు: టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి బర్త్‌డే వేడుకలను చెన్నూరు కాంగ్రెస్అభ్యర్థి, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి నేతృత్వంలో ఘనంగా నిర్వహించారు. బుధవారం జైపూర్మండలం, మందమర్రి మున్సిపాలిటీలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పలుచోట్ల గ్రామస్తులు, యువకులు, లీడర్ల సమక్షంలో వివేక్ వెంకటస్వామి కేక్ కోసి సంబురాలు జరుపుకున్నారు.
నర్సింగాపూర్, కుందారంలో గ్రామ యువకుడు కార్తీక్ బర్త్‌డేతో పాటు , మందమర్రిలోని ఐఎన్టీయూసీ యూనియన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేక్‌ను మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ బి.జనక్‌ప్రసాద్, కాంపెల్లి సమ్మయ్య, దేవి భూమయ్య,కాంగ్రెస్ లీడర్లు, కార్యకర్తల నడుమ వివేక్ వెంకటస్వామి కట్ చేశారు.
రేవంత్ రెడ్డి కాబోయే సీఎం: గడ్డం వినోద్
బెల్లంపల్లి : రాష్ట్రానికి కాబోయే సీఎం రేవంత్ రెడ్డి అని కాంగ్రెస్ పార్టీ బెల్లంపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి, మాజీ మంత్రి గడ్డం వినోద్ అన్నారు. యువజన కాంగ్రెస్ లీడర్ రామగిరి మహేశ్ ఆధ్వర్యంలో బెల్లంపల్లి పట్టణంలోని వినోద్ నివాసంలో రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను బుధవారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి సంబురాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా వినోద్ మాట్లాడుతూ పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతోందని ధీమా వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా కాంగ్రెస్ ఎదిగిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరుతో కేసీఆర్ లక్షల కోట్లు లూటీ చేశారని ఆరోపించారు. బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజలు తనను ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ బెల్లంపల్లి టౌన్ ప్రెసిడెంట్ ముచ్చర్ల మల్లయ్య, మున్సిపల్ మాజీ చైర్మన్ సూరిబాబు, మహిళా నాయకురాలు కనకదుర్గ, డాక్టర్ చారి పాల్గొన్నారు.