డీజీపీకి రేవంత్​రెడ్డి ఫోన్​.. పరిస్థితి చెయ్యి దాటితే మీదే బాధ్యత

కాంగ్రెస్ పార్టీ ఖమ్మంలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న జన గర్జన సభకు బీఆర్​ఎస్​ ఆటంకాలు సృష్టించడాన్ని టీపీసీసీ చీఫ్ రేవంత్​రెడ్డి​ తీవ్రంగా తప్పుబట్టారు. సీఎం కేసీఆర్​పాలన అంతం కాబోయే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని విమర్శించారు. కాంగ్రెస్​ నేతలు, కార్యకర్తలను ఆర్టీఏ అధికారులు చెక్​పోస్టులు పెట్టి అడ్డుకుంటున్న విషయాన్ని రేవంత్​ డీజీపీ అంజనీ కుమార్​కు చెప్పారు. పరిస్థితి చేయి దాటితే డీజీపీ బాధ్యత తీసుకోవాలని అన్నారు. 

సభకు అడ్డంకులు సృష్టించడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. అనంతరం కాంగ్రెస్​ పార్టీ ప్రచార కమిటీ ఛైర్మన్​మధుయాష్కీ గౌడ్​తో కలిసి రేవంత్​ ఖమ్మం సభకు బయల్దేరారు.