మూడు గంటల కరెంట్ చాలని తాను ఎక్కడన్నానో నిరూపిస్తే.. తన నామినేషన్ విత్ డ్రా చేసుకుంటానని సీఎం కేసీఆర్ కు సవాల్ విసిరారు టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. జోగులాంబ గద్వాల జిల్లా ఆలంపూర్ కాంగ్రెస్ ప్రజాగర్జన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. ఆలంపూర్ గడ్డ కాంగ్రెస్ అడ్డ అని అన్నారు. కేసీఆర్ జోగులాంబ ఆలయానికి ఇస్తానన్న వంద కోట్లు ఏమయ్యాయని రేవంత్ ప్రశ్నించారు.
ఉచిత విద్యుత్ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు రేవంత్. బీఆర్ఎస్ నేతలు 24 గంటల కరెంట్ ఎక్కడ ఇస్తున్నారో చూపించాలన్నారు. కాంగ్రెస్ గెలిస్తే ఆర్డీఏ సమస్యను పరిష్కరిస్తామన్నారు. ఆలంపూర్ కోసం సంపత్ పోరాటం చేశాడని.. అలంపూర్ లో ఏం అభివృద్ధి జరిగిందోబీఆర్ఎస్ నేతలను ప్రశ్నించాలన్నారు. ఆలంపూర్ అభివృద్ధికోసం అసెంబ్లీలో సంపత్ పోరాడాడని చెప్పారు.
చల్లా వెంకట్రామి రెడ్డి కల్వకుంట్ల ఫ్యామిలీ దగ్గర బానిసలా మారిపోయిండని విమర్శించారు రేవంత్. దొరగారి దొడ్లో జీతగాడిలా బతుకుతుండని ధ్వజమెత్తారు. ధరణి పేరుతో కేసీఆర్ రాష్ట్రాన్ని దోచుకుంటుండని ఆరోపించారు. ధరణి కేసీఆర్ కు ఏటీఎంలా మారిందన్నారు. దొరల తెలంగాణకు ప్రజల తెలంగాణకు మధ్యే పోటీ అన్నారు. మహబూబ్ నగర్ లో 14 సీట్లు కాంగ్రెస్ గెలిచి రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ ఎన్ని డబుల్ డబుల్ బెడ్రూం ఇళ్లు ఇచ్చారో చెప్పాలన్నారు.
ALSO READ : ఏనాడు కూడా రైతుబంధు,దళితబంధు ఆపమని చెప్పలే : ఉత్తమ్ కుమార్ రెడ్డి