మోదీ సహకారంతోనే రేవంత్ రెడ్డి సీ‌‌‌‌‌‌‌‌ఎం : ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి

సూర్యాపేట, వెలుగు :  ప్రధాని మోదీ సహకారంతోనే రేవంత్ రెడ్డి సీ‌‌‌‌‌‌‌‌ఎం అయ్యారని సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం నియోజకవర్గంలో సూర్యాపేట రూరల్ మండలం, సోలిపేట, సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలో బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా  జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణాలో మళ్లీ కేసీఆర్ హవా మొదలైందని

కేసీఆర్​తోనే తెలంగాణకు శ్రీరామ రక్ష అని ప్రజలు నమ్ముతున్నారని తెలిపారు. ముస్లిం రిజర్వేషన్ల రద్దు పేరుతో బీజేపీ మొత్తం రిజర్వేషన్ల రద్దుకు కుట్ర చేస్తుందని ఆరోపించారు.  ప్రజల్లో సెంటిమెంట్ రగిల్చి పబ్బం గడిపేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తుందన్నారు.  పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాష్ట్ర పరిస్థితుల్లో మార్పు రావడం ఖాయమన్నారు.