బాజిరెడ్డిని ఎందుకు గెలిపించాలి? : రేవంత్​రెడ్డి 

  • ఆర్టీసీ కార్మికుల చావులకు కారకుడు బాజిరెడ్డి   
  • కవితను ఓడించారని జిల్లాపై కేసీఆర్​కు కోపం  

నిజామాబాద్, వెలుగు :  సీఎం కేసీఆర్​ తరహాలోనే రూరల్​ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్​​ ఆస్తులు పెంచుకొని ఫాంహౌజ్​​ నిర్మించాడని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి ఆరోపించారు. మళ్లీ పోటీ చేస్తున్న ఆయన్ను ఎందుకు గెలిపించాలో ఆలోచించాలని ప్రజలను కోరారు. రూరల్​ సెగ్మెంట్​లోని ధర్పల్లి మండల కేంద్రంలో బుధవారం జరిగిన జనభేరి జనసభలో ఆయన ప్రసంగించారు. ఆర్టీసీ సమ్మె  టైంలో 50 మంది కార్మికుల ఆత్మహత్యలకు కేసీఆర్, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి కారణమయ్యారని ఆరోపించారు. ​కార్మికులను పొట్టనబెట్టుకున్న బాజిరెడ్డిని వంద మీటర్ల గోతిలో బొందపెట్టాలన్నారు.  2019 లోక్​సభ ఎన్నికల్లో కవితను ఓడించారని జిల్లా ప్రజలపై  కేసీఆర్​కు కోపమన్నారు.

అందుకే  పోడుభూముల సమస్య పరిష్కరించలేదని, మంచిప్ప రిజర్వాయర్​ పనులను ఎక్కడ వేసిన గొంగడిలా అక్కడే ఉంచారన్నారు. నిజాం షుగర్​ ఫ్యాక్టరీకి తాళం వేశారన్నారు.  పసుపు, ఎర్రజొన్న రైతులపై కేసులు మాఫీ కాలేదన్నారు. నియోజకవర్గంలో వంద బెడ్​ల హాస్పిటల్​ నిర్మాణం మరిచారన్నారు. కవితను  ఎమ్మెల్సీ చేసినా ప్రజలకు ఏం ఒరిగిందని ప్రశ్నించారు. ఉమ్మడి జిల్లా సమస్యలకు పరిష్కారం చూపే ఆలోచనతో హైకమాండ్​ తనను కామారెడ్డి నుంచి పోటీ చేయిస్తోందని గెలిపించాలని కోరారు. అసలు డ్యూటీ పక్కనబెట్టి బీఆర్ఎస్​ కార్యకర్తలా పనిచేస్తున్న బోధన్​ ఏసీపీ కిరణ్​కుమార్​ పేరును రెడ్​ డైరీలో రాస్తున్నామని రేవంత్​ వార్నింగ్​ ఇచ్చారు.  కార్యక్రమంలో డీసీసీ ప్రెసిడెంట్ మానాల మోహన్​రెడ్డి, తాహెర్​,  ముప్పగంగారెడ్డి, కంచెట్టి గంగాధర్​, ఇమ్మడి గోపి, సాయిరెడ్డి, భోజన్న, చిన్న