దొరల రాజ్యంలో బార్లు, వైన్ షాపులు పెరిగాయని పీసీసీ ఛీప్ రేవంత్ రెడ్డి విమర్శించారు. దొరల పాలనను తరిమికొట్టే టైం వచ్చిందని.. ఇందిరమ్మ రాజ్యం కావాలా? దొరల రాజ్యం కావాలా? అని ప్రశ్నించారు. పాలమూరును కావాలనే కేసీఆర్ వదిలేశారని చెప్పారు. అచ్చంపేటలో ఎన్ని డబుల్ బెడ్రూం ఇండ్లు ఇచ్చారా అని అడిగారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినా పాలమూరులో వలసలు ఆగలేదని రేవంత్ రెడ్డి అన్నారు.
తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం రాబోతుందని రేవంత్ రెడ్డి అన్నారు. అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలు అమలు చేసి తీరతామని చెప్పారు. మహిళలు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం.. ఎక్కడికి వెళ్లినా ఫ్రీ అని తెలిపారు. పెన్షన్ రూ. 4 వేలు ఇస్తామన్నారు. అచ్చంపేటలో రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.