బీఆర్ఎస్ నేతలు జేబు దొంగలకు కూడా చాన్స్ ఇస్తలేరని విమర్శించారు టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఇసుక, భూ దందాలన్నీ బీఆర్ఎస్ నేతలయేనన్నారు. కొడంగల్ గుండుమల్ లో ప్రచారం చేసిన రేవంత్ రెడ్డి...బీఆర్ఎస్ నేతల అక్రమాలపై విరుచుకుపడ్డారు. బంగారు తెలంగాణ అన్నారు.. బంగారం ఏమైనా ఇచ్చారా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఏ వర్గానికి న్యాయం జరగలేదన్నారు.
కొడంగల్ లో తాను చేసిన పనులే తప్ప కొత్తగా ఏం జరగలేదన్నారు రేవంత్. పాలమూరు ఎత్తిపోతల నుంచి నీళ్లేందుకు రావని ప్రశ్నించారు. మూటలు, బీరు సీసాలతో బీఆర్ఎస్ నేతలు ఊర్లకు వస్తున్నారని..జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కారు గుర్తును నమ్మడమే మనం చేసిన పెద్ద తప్పన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇంటికి, బావికి ఉచిత్ కరెంట్ ఇస్తామని చెప్పారు. ఇల్లు లేని పేదలకు 5లక్షలు ఇస్తామన్నారు.
అంతకుముందు మద్దూరులో కాంగ్రెస్ విజయభేరి యాత్ర నిర్వహించారు రేవంత్. ఈ సందర్బంగా మాట్లాడిన ఆయన .. మద్దూరుకు నీళ్లు రాలే కానీ.. ఊరురా బెల్టు షాపులొచ్చాయన్నారు. కాంగ్రెస్ వస్తే రైతుబంధు ఆగిపోతుందని.. కేసీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు రేవంత్. కాంగ్రెస్ వస్తే రైతుబందు కొనసాగిస్తామని చెప్పారు. ఓటెయ్యకుంటే దళితబంధు ఇవ్వమని బెదిరిస్తున్నారని.. కాంగ్రెస్ వస్తే దళితబందు కొనసాగిస్తామన్నారు. కేసీఆర్ మతితప్పి మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.