రేవంత్ రెడ్డి కాన్వాయ్‍కు యాక్సిడెంట్

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డి పేట మండలం తిమ్మాపూర్ వద్ద టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కాన్వాయ్ కు యాక్సిడెంట్ జరిగింది. కాన్వాయ్ ఓవర్ స్పీడ్ లో రావడంతో 6 కార్లు బలంగా ఒకదానికొకటి ఢీకొనడంతో ఘటన చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ సమయంలో ఒక్కసారిగా బెలూన్లు ఓపెన్ కావడంతో భారీ ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో 4 కార్లతో పాటు ఇద్దరు రిపోర్టర్ల కార్లు పూర్తిగా  ధ్వంసమయ్యాయి. దీంతో కారులో ప్రయాణిస్తున్న వీ6, టీవీ 9, ఎన్టీవీ, ఏబీఎన్, సాక్షి, న్యూస్ నౌ, బిగ్ టీవీ రిపోర్టర్లు ఉన్నట్టు సమాచారం. స్వల్ప గాయాలతో సిరిసిల్ల రిపోర్టర్లు బయటపడ్డట్టు తెలుస్తోంది. కాగా ఈ ప్రమాదంలో ఎవరికీ ఏం కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.