రంగురంగుల వీడియోలు పెట్టే కవితకు.. ప్రవల్లిక ఆత్మ ఘోష వినబడటం లేదా!?

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.  బతుకమ్మ సంబరాల గురించి రంగురంగుల వీడియోలు పెట్టే ఎమ్మెల్సీ కవితకు గ్రూప్ పరీక్షల నిర్వహణ అవకతవకలతో బతుకు భారమై, భవిత  ఆగమై ఆత్మహత్య చేసుకున్న ప్రవల్లిక ఆత్మ ఘోష వినబడటం లేదా అని ట్విట్టర్లో ప్రశ్నించారు.  ఆడబిడ్డల హక్కులు మీ దృష్టిలో రాజకీయ అంగడి సరుకే తప్ప..  పొలిటికల్ స్లోగన్లు తప్ప మానవీయ ఎజెండాలు కాదని విమర్శించారు. 

బతుకమ్మ  ఆడబిడ్డల ఆత్మీయ సంగమం. మన తెలంగాన ఆత్మగౌరవ సంబంరం. బతుకమ్మ శుభాకాంక్షలతో ఈ ఏడాది బతుకమ్మ పాటలు మీకోసం అంటూ ఎమ్మెల్సీ కవిత తన ట్విట్టర్లో పోస్ట్ చేసిన వీడియోను రేవంత్ తన రీ ట్వీట్ చేస్తూ కౌంటర్ ఇచ్చారు.

ALSO READ: ప్రవల్లిక ఆత్మహత్యపై 48 గంటల్లో నివేదిక ఇవ్వండి: గవర్నర్

వరంగల్ కు చెందిన విద్యార్థిని మర్రి ప్రవల్లిక (25)  హైదరాబాద్ లో అక్టోబర్ 13న  ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ఆమె అశోక్ నగర్ లో తాను ఉంటున్న బృందావన్ గర్ల్స్ హాస్టల్ లో ఉరేసుకుంది. ఈ విషయం తెలిసి నిరుద్యోగులు పెద్ద ఎత్తున అక్కడికి తరలివచ్చారు. పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం వరంగలో లోని ఆమె స్వగ్రామానికి ప్రవల్లిక మృతదేహాన్ని తరలించారు.