ఆత్మీయ సమ్మేళనాలన్నీ తాగుబోతుల సమ్మేళనాలే.. సభా ప్రాంగణాలన్నీ పర్మిట్ రూంలే

ఆత్మీయ సమ్మేళనాలన్నీ తాగుబోతుల సమ్మేళనాలే.. సభా ప్రాంగణాలన్నీ పర్మిట్ రూంలే

నల్గొండలో జరిగిన నిరుద్యోగ నిరసన ర్యాలీలో పాల్గొన్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వంపై మండి పడ్డారు. కేసీఆర్ ఏనాడూ తెలంగాణకు న్యాయం చేయలేదని ధ్వజమెత్తారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఎలక్షన్స్, కలెక్షన్స్ కోసం రాజీనామా చేసిన దొంగ కేసీఆర్ అని ఆరోపించారు.

బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగులకు అన్యాయం చేసిందని, తెలంగాణ వచ్చినపుడు లక్షా 91 వేలు ఉద్యోగ ఖాళీలు ఉంటే.. అధికారంలోకి వచ్చిన 9ఏళ్లలో 2 లక్షల ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని అన్నారు. ఉద్యోగాలు ఇవ్వడంలో కేసీఆర్ ప్రభుత్వం ఫెయిల్ అయిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు.

వాళ్ళు రాజ్యాలు ఏలడానికా.. నిరుద్యోగులు కుల వృత్తులపై ఆధారపడడానికా 1200 మంది ఉద్యమంలో ఆత్మ బలిదానాలు చేసి తెలంగాణ తెచ్చుకుందని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ లో అవినీతికి పాల్పడుతున్న వాళ్లు పెరిగిపోయారని, దళిత బంధులో కమిషన్ తీసుకున్న ఎమ్మెల్యేల లిస్ట్ ఉందన్న కేసీఆర్.. దాన్ని ఎందుకు బయట పెట్టట్లేదో చెప్పాలని నిలదీశారు.

బానిసలుగా బతికిన వ్యక్తులు జిల్లాకు నాయకత్వం వహిస్తున్నారన్న రేవంత్.. వచ్చే ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీని గద్దెనెక్కించాలని ప్రజలను కోరారు.