కరీంనగర్: హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో పర్యటిస్తున్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇవాళ తనుగుల ఇసుక రీచ్ ను పరిశీలించారు. ఇసుక రవాణాలో అక్రమాలు జరుగుతున్నాయని, ఒకే పర్మిషన్ మీద నాలుగు లారీల ఇసుక తరలిస్తున్నారని విమర్శించారు. అయితే, మొదట సరైన రూట్ మ్యాప్ లేకపోవడంతో గందరగోళానికి గురయ్యారు. ఇసుక రీచ్ కు వెళ్లేందుకు దారి తప్పారు. సరైన దారి తెలియక రెండు సార్లు రాంగ్ రూట్ కు వెళ్లారు. సింగిల్ రోడ్లల్లో కాన్వాయ్ లను తిప్పలేక ఇబ్బంది పడ్డారు.