హైదరాబాద్, వెలుగు: ఈ నెల 31న కొల్లాపూర్‌లో నిర్వహించనున్న పాలమూరు ప్రజాగర్జన సభకు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కోఆర్డినేటర్లను నియమించారు. ఈ సభకు ప్రియాంక గాంధీ హాజరుకానున్న నేపథ్యంలో సభా కోఆర్డినేటర్లుగా సంపత్‌కుమార్, మల్లు రవి, చిక్కుడు వంశీకృష్ణలను నియమిస్తూ శనివారం ఆదేశాలు జారీ చేశారు.
దాంతో పాటు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగానూ కోఆర్డినేటర్లను నియమించారు. ఆలంపూర్ ఇన్చార్జ్ గా రవళి రెడ్డి, గద్వాల్ఇన్చార్జ్ గా పి. రఘువీర్ రెడ్డి, వనపర్తికి ఎ. మధుసూదన్ రెడ్డి, నాగర్‌కర్నూల్‌కు కిషోర్ రెడ్డి, అచ్చంపేట సి. మధుసూదన్ రెడ్డి, కొల్లాపూర్‌కు ఒబెదుల్లా కొత్వాల్, చరణ్ కౌశిక్యాదవ్కు బాధ్యతలు అప్పగించారు.