6+6 భద్రత కల్పించాలి : డీజీపీకి రేవంత్​ లేఖ

తన భద్రతపై తెలంగాణ రాష్ట్ర డీజీపీ అంజనీకుమార్ కు పీసీసీ చీఫ్​ రేవంత్​ రెడ్డి లేఖ రాశారు. యాత్ర సందర్భంగా సెక్యూరిటీ కల్పించాలని రేవంత్ రెడ్డి గతంలో హైకోర్టును ఆశ్రయించారు. ఎన్నికలు ముగిసే వరకు తనకు భద్రత కల్పిస్తామని హైకోర్టుకు చెప్పినా ఇప్పటి వరకు తనకు సెక్యూరిటీ కల్పించలేదని లేఖలో వివరించారు రేవంత్ రెడ్డి. 

హైకోర్టులో మాత్రం 69 మంది సిబ్బందితో సెక్యూరిటీ కల్పిస్తున్నామని పోలీసులు తప్పుడు వాదనలు చేశారని రేవంత్ తెలిపారు. ఈ ఏడాది జులైలో తనకు ఉన్న 2+2 భద్రతను కూడా వెనక్కి తీసుకున్నారని చెప్పారు. తనకు హైకోర్టు ఆదేశాల ప్రకారం తక్షణమే 6+6 భద్రత కల్పించాలని డీజీపీని కోరారు. లేనిపక్షంలో కంటెంట్ ఆఫ్ ద కోర్టు కింద కేసు వేస్తామని లేఖలో తెలిపారు.