కామారెడ్డి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారానికి బయలుదేరిన టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి హెలికాప్టర్ లో సాంకేతిక లోపం ఏర్పడింది. దీంతో రేవంత్ రెడ్డి రోడ్డు మార్గంలో కామారెడ్డికి వెళ్తున్నారు. కామారెడ్డి నియోజక వర్గంలో మూడు సభలలో పాల్గొని ప్రసంగించనున్న రేవంత్ రెడ్డి.. రోడ్డు మార్గంలో వెళ్తుండడంతో సభలకు ఆలస్యమైంది.
దీంతో ఈరోజు(నవంబర్ 18) రాత్రి 7 గంటలకు సభలు ప్రారంభం కానున్నాయి. రాత్రి 7 గంటలకు కామారెడ్డి నియోజకవర్గం బిక్కనూరులో మొదటి సభలో రేవంత్ రెడ్డి ప్రసంగించనున్నారు. ఆ తర్వాత రాత్రి 8 గంటలకు రాజంపేటలో సభ పాల్గొంటారు. అనంతరం రాత్రి 9 గంటలకు చిన్న మల్లారెడ్డి సభలో రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు.