నా ఫోన్‌‌‌‌ను రేవంత్‌‌‌‌ రెడ్డి ట్యాప్ చేయిస్తున్నరు..కేటీఆర్ ఆరోపణ

నా ఫోన్‌‌‌‌ను రేవంత్‌‌‌‌ రెడ్డి ట్యాప్ చేయిస్తున్నరు..కేటీఆర్ ఆరోపణ

హైదరాబాద్, వెలుగు: తన ఫోన్‌‌‌‌ తో పాటు మంత్రుల ఫోన్లనూ సీఎం రేవంత్‌‌‌‌ రెడ్డి ట్యాప్ చేయిస్తున్నారని బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. సీఎంకు దమ్ముంటే కెమెరాల ముందు ఈ అంశంలో తనతో పాటు లై డిటెక్టర్ పరీక్షకు రావాలని కేటీఆర్ సవాల్ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఓ మీడియా చానెల్ నిర్వహించిన సదస్సులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

సొంత పార్టీ ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష నేతల ఫోన్లను కూడా రేవంత్ ట్యాప్ చేయిస్తున్నారని ఆయన ఆరోపించారు. మన దేశంలో ఎన్నికలు ఒకరిని ఎన్నుకోవడం కంటే అధికారంలో ఉన్నవారిని తిరస్కరించడానికే జరుగుతుంటాయన్నారు. తమను కూడా ప్రజలు అలాగే తిరస్కరించారన్నారు. తమను ఓడించడంలో భాగంగా కాంగ్రెస్ గెలిచిందే తప్ప, కాంగ్రెస్‌‌‌‌ను గెలిపించాలని ప్రజలు అనుకోలేదని కేటీఆర్ అభిప్రాయపడ్డారు.