
ఆసిఫాబాద్ , వెలుగు : పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో జన జాతర బహిరంగ సభలో సీఎం పాల్గొననన్నారు. హైదరాబాద్ నుంచి హెలీ కాప్టర్ ద్వారా రేవంత్ రెడ్డి జిల్లాకు చేరుకుంటారు. పట్టణం లోని ప్రేమలాగార్డెన్ సమీపంలోని సభ ఏర్పా–ట్లు పూర్తయ్యాయి. ఉమ్మడి జిల్లా ఇన్ చార్జ్ మంత్రి సీతక్క అధ్వర్యంలో డీసీసీ అధ్యక్షుడు కొక్కిరాల విశ్వప్రసాద్ రావు , నియోజకవర్గ ఇన్చార్జి అజ్మీర శ్యామ్ నాయక్ నేతృత్వంలో ఏర్పాట్లు జరిగాయి.