
ఢిల్లీలో తెలంగాణకు చెందిన కాంగ్రెస్ నేతలు బిజీబిజీగా ఉన్నారు. రాహుల్ గాంధీతో రేవంత్ రెడ్డి, మైనంపల్లి హనుమంత రావు, ఆయన కుమారుడు రోహిత్, వేముల వీరేశం, నక్కా ప్రభాకర్ గౌడ్ భేటీ అయ్యారు. గురువారం (సెప్టెంబర్ 28న) ఖర్గే సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు ఈ నలుగురు నేతలు. రాహుల్‌తో జరిగిన మర్యాదపూర్వక భేటీలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఇన్ చార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే కూడా ఉన్నారు.
ALSO READ : హుస్సేన్‌సాగర్ వద్ద బారులుతీరిన గణేష్ విగ్రహాలు
మైనంపల్లి హనుమంతరావు కాంగ్రెస్ పార్టీలో చేరటంతోపాటు.. తనకు, తన కుమారుడు ఇద్దరికీ సీట్లు కన్ఫామ్ చేసుకున్నారు. ఒకరు అసెంబ్లీ.. మరొకరు పార్లమెంట్ కు పోటీ చేయటానికి సిద్ధం అవుతున్నారు. నిన్న పార్టీ అధ్యక్షులు ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోగా.. సెప్టెంబర్ 29వ తేదీ ఢిల్లీలో రాహుల్ గాంధీతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు మైనంపల్లి హనుమంతరావు. కాంగ్రెస్ లో చేరటంతోపాటు ఆయనకు మరిన్ని కీలక బాధ్యతలు అప్పగించనున్నట్లు సమాచారం.