కోదండరాంతో రేవంత్ రెడ్డి భేటీ.. పొత్తా? మద్దతా.?

టీజేఎస్  చీఫ్ కోదండరాంతో టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. నాంపల్లిలోని టీజేఎస్ ఆఫీసులో సమావేశమయ్యారు.  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు లేదా, మద్దతు విషయంపై చర్చించనున్నారు.  ఇటీవల రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేతో కోదండరాం భేటీ అయ్యారు.  వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ,టీజేఎస్ కలిసి పనిచేయాలని ఇప్పటికే నిర్ణయించాయి. 

ఇటీవల తెలంగాణకు వచ్చిన రాహుల్ గాంధీతో  కరీంనగర్ వీ పార్క్ హోటల్ లో కోదండరామ్ భేటీ అయ్యారు. ఎన్నికల్లో తమకు మద్దతు ఇవ్వాలని రాహుల్ కోరినట్లు చెప్పారు.  తెలంగాణలో నిరంకుశ పాలన పోవాలనే అభిప్రాయాన్ని రాహుల్ వ్యక్తం చేసినట్లు కోదండరాం తెలిపారు. తెలంగాణలో నిరంకుశ పాలన పోవాలన్న తన అభిప్రాయంతో రాహుల్ ఏకీభవించినట్లు తెలిపారు.    తెలంగాణలో ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులు,బీఆర్ఎస్ పాలనపై  చర్చించామన్నారు. మరోసారి రాహుల్  టీం తమతో చర్చలు జరపనున్నట్లు  తెలిపారు. ఈ క్రమంలో రేవంత్ తో కోదండరాం భేటీ అయ్యారు.  కోదండరాం  కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటారా? లేక మద్దతిస్తారా? అనేది వేచి చూడాలి.