రేవంత్ రెడ్డి మనవడి పేరు ఇదే.. కాకతీయ వంశ రాజుల్లో ఒకటి

రేవంత్ రెడ్డి మనవడి పేరు ఇదే.. కాకతీయ వంశ రాజుల్లో ఒకటి

తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తాత అయిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 21వ తేదీ మనవడికి పేరు పెట్టారు. తల్లిదండ్రులు సంప్రదాయ బద్దంగా రియాన్స్ అని పెట్టారు. అయితే ముద్దల మనవడికి మాత్రం తాను సెపరేట్ గా పెట్టుకున్నారు రేవంత్ రెడ్డి. ఆ పేరేంటో తెలుసా.. రుద్రదేవుడు. తనకు ఇష్టమైన రుద్రదేవుడు పేరుతోనే నా మనవడిని పిలుచుకుంటాను అంటున్నారు రేవంత్ రెడ్డి. 

తెలంగాణ చరిత్రలో రుద్రదేవుడి చెరగని ముద్ర వేశారు. రుద్రదేవుడు 1158 నుంచి -62  వరకు సామంత రాజుగా.. 1163 నుంచి -95 వరకు స్వతంత్ర రాజుగాపాలన చేశాడు రుద్రదేవుడు. 1163లో సంపూర్ణ స్వాతంత్య్రాన్ని ప్రకటించుకుని తెలంగాణలో మొదటి విశాల రాజ్యాన్ని స్థాపించాడు. కాకతీయ వంశ పాలకుల్లో రుద్రదేవుడు ఒకడు కాగా.. ఇతడిని మొదటి ప్రతాప రుద్రుడుగా కూడా భావిస్తారు. 

ప్రస్తుతం ఓరుగల్లలోని వెయ్యి స్థంబాల గుడిని రుద్రదేవుడే నిర్మించాడు. రుద్రదేవుడి పాలనలో తెలంగాణ రాజ్యం ఉత్తరాన గోదావరి వరకు.. పశ్చిమాన బీదర్ వరకు.. దక్షిణాన శ్రీశైలం వరకు విస్తరించింది. రాజనీతిలో దురంధరుడు రుద్రదేవుడు. తెలంగాణ చరిత్రలో కాకతీయ వైభవాన్ని విస్మరించలేం.. అలాంటి వంశంలోని మొదటి పాలకుడు అయిన రుద్రదేవుడు పేరుతోనే.. తన మనవడిని పిలుచుకుంటాను అంటున్నారు రేవంత్ రెడ్డి. 

అంతటి ఘనమైన పేరును పెట్టుకున్నారు.. తాతకు తగ్గట్టు మనవడు కూడా రాజకీయాల్లోకి వస్తారా ఏంటీ..