వేములవాడ రాజన్నను దర్శించుకున్న రేవంత్ రెడ్డి

 పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి  వేములవాడలో శ్రీ రాజరాజేశ్వర స్వామిని  దర్శించుకున్నారు.  స్వామివారికి కోడె మొక్కులు చెల్లించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.  భక్తుల కోరికలు తీర్చే రాజన్నను దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. వేములవాడ ఆలయాన్ని  అభివృద్ధి చేస్తానని కేసీఆర్ మాటతప్పి..కేసీఆర్ మోసం చేశారని విమర్శించారు. కాంగ్రెస్  హయాంలోనే ఆలయ అభివృద్ధి జరిగిందన్నారు. 

మిడ్ మానేరు బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. కేసీఆర్ కుటుంబ సభ్యులకు ఇచ్చి గిరజనులకు ఎందుకివ్వడం లేదని ప్రశ్నించారు. దొరలకు ఓ నీతి గిరిజనులకుఓ నీతా అని ప్రశ్నించారు.