కామారెడ్డిలో తెలంగాణ సీఎం కేసీఆర్ కు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. 24 గంటల ఉచిత్ కరెంట్ పై చర్చకు సిద్దమా అని కేసీఆర్ ను ప్రశ్నించారు. సాయంతం 3 గంటల వరకు టైమ్ ఇస్తున్న.. తెలంగాణలో 24 గంటల కరెంట్ వస్తే తాను కొడంగల్, కామారెడ్డిలో నామినేషన్ ఉపసంహరించుకుంటానని సవాల్ విసిరారు. లేదంటే కామారెడ్డిలో ముక్కు నేలకు రాస్తావా కేసీఆర్ అని ఛాలెంజ్ చేశారు రేవంత్.
ఉద్యమం సమయంలో రూపాయి లేని కేసీఆర్ కుటుంబానికి ఇవాళ వేల కోట్ల ఆస్తులు , విమానాలు ఎక్కడి నుండి వచ్చాయని రేవంత్ ప్రశ్నించారు. డబ్బు,మద్యంతో ప్రజలను మభ్యపెట్టి గెలవాలని కేసిఆర్ అనుకుంటున్నాడని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఉచిత కరెంట్, మైనార్టీ లకు రిజర్వేషన్ ఇచ్చిందని చెప్పారు. రాజశేఖర్ రెడ్డి రూ. 12 వేల కోట్ల కరెంట్ బకాయిల రద్దు చేశారని తెలిపారు.
కామారెడ్డి ఎన్నిక రాష్ట్ర భవిష్యత్తును మారుస్తుందన్నారు రేవంత్. కర్ణాటకలో గెలిచినా విధంగా కాంగ్రెస్ తెలంగాణలో గెలిస్తే వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేగా తాను ఎక్కడైనా గెలుస్తానని చెప్పిన రేవంత్.. కేసీఆర్ కు బుద్ధి చెప్పడానికి కామరెడ్డి కి వచ్చినట్టుగా తెలిపారు.