భీమదేవరపల్లి, వెలుగు : హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ములుకనూరులోని ప్రజా గ్రంథాలయాన్ని ఆదివారం సీఎం రేవంత్‌రెడ్డి ఓఎస్‌డీ వేముల శ్రీనివాసులు సందర్శించారు. ఈ సందర్భంగా వివిధ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న యువకులతో మాట్లాడారు.
అనంతరం లైబ్రరీ కమిటీ సభ్యులతో నిర్వహించిన మీటింగ్ ఆయన మాట్లాడారు. లైబ్రరీని మోడల్‌గా తీర్చిదిద్దడంతో పాటు, ఎక్స్‌పర్ట్స్‌తో ఆన్‌లైన్ క్లాస్‌లు నిర్వహిస్తామని చెప్పారు. సమావేశంలో సర్పంచ్ కొమురయ్య, సభ్యులు మూల శ్రీనివాస్, సుగుణాకర్, ప్రమోద్‌రెడ్డి, ఎదులాపురం తిరుపతి పాల్గొన్నారు.