పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్ర ఖమ్మం జిల్లా భద్రాచాలంలో కొనసాగుతోంది.ఈ సందర్భంగా దారి వెంట వెళ్తుండగా వరి నాట్లు వేసే మహిళా కూలీలతో రేవంత్ మాట్లాడారు. పొలంలోకి దిగి వారితో కలిసి కాసేపు వరి నాటేశారు. ఈ సందర్భంగా కూలీలు వారి సమస్యలను రేవంత్ తో చెప్పుకున్నారు. కూలీలు ఏడుస్తుండగా రేవంత్, సీతక్క వారిని ఓదార్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మీ కష్టాలు తీరుస్తదని వారికి హామీ ఇచ్చారు.