కామారెడ్డిలో కేసీఆర్పై పోటీకి సిద్ధం: రేవంత్ రెడ్డి

అధిష్ఠానం ఆదేశిస్తే కామారెడ్డిలో కేసీఆర్ పై తాను పోటీ చేసేందుకు సిద్ధమని టీపీసీసీ చీఫ్ రేవంత్‌ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల నియమావళిని  ఉల్లంఘిస్తోందని ఢీల్లీలో  కేంద్ర ఎన్నికల సంఘానికి గురువారం(అక్టోబర్ 26) కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంపి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టీ విక్రమార్కలతో కలిసి రేవంత్ రెడ్డి  ఫిర్యాదు చేశారు.  అనంతర ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో  రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..

బీఆర్ఎస్ కు అనుకూలంగా ఉన్న  రిటైర్డ్ అధికారులను ఎన్నికల విధుల నుంచి  వెంటనే తొలిగించాలని ఈసీని కోరినట్లుగా తెలిపారు.  డీజీపీ అంజనీ కుమార్ ను కూడా వెంటనే తొలిగించాలని ఈసీకి ఫిర్యాదు చేశామన్నారు.  నిష్పక్షపాతంగా వ్యవహరించే అధికారులను  నియమించాలని..  సంక్షేమ పథకాల నగదు బదిలీపై ఎన్నికల అధికారులకు సూచన చేశామని చెప్పారు.  నోటిఫికేషన్‌కు ముందే నగదు బదిలీని పూర్తి చేయాలని ఈసీకి చెప్పామని... కాని, సంక్షేమ పథకాలు ఆపేయాలని ఫిర్యాదు చేసినట్లు  బీఆర్ఎస్ తమపై తప్పుడు ప్రచారం చేస్తు్ందని ఆయన మండిపడ్డారు.
 
కొడంగల్ లో పోటీ చేయాలని కేసీఆర్ ను ఆహ్వానించానని... కొడంగల్ లో పోటీకి కెసిఆర్ రాకపోతే కామారెడ్డిలో పోటీకి సిద్ధమని రేవంత్ అన్నారు. పార్టీ ఆదేశిస్తే తానైనా, భట్టీ విక్రమార్క అయినా.. కామారెడ్డిలో కెసిఆర్ పై, సిరిల్లలో కేటీఆర్ పై పోటీకి సిద్ధమని తెలిపారు.  కేసీఆర్, కేటీఆర్ లను చిత్తుగా ఓడించేందుకు మేము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఉమ్మడి ఏపీలో ప్రజలు ఎప్పుడూ హంగ్ కు అవకాశం ఇవ్వలేదని... తెలంగాణలోనూ హంగ్ ఎప్పుడూ రాలేదని.. రెండింట మూడో వంతు మెజారిటీతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

ALS0 READ: రాజస్థాన్ సీఎం గెహ్లాట్ కుమారుడికి ఈడీ సమన్లు