హైదరాబాద్: జాతీయ పార్టీ పెట్టేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్న సీఎం కేసీఆర్ దేశ వ్యాప్తంగా తిరగడం కోసం ప్రైవేటు విమానం కొనుగోలు చేయనున్నట్లు వచ్చిన వార్తలపై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తనదైన శైలిలో స్పందించారు. ‘అమరవీరుల కుటుంబాలను కలిసింది లేదు.. - ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను ఏ నాడు పరామర్శించ లేదు...- ప్రగతి భవన్ ఏసీ గదిని వీడింది లేదు... ఫాంహౌస్ దాటింది లేదు.. ఇప్పుడు దేశదిమ్మరిలా తిరగడానికి విమానం కొంటున్నాడట..’ అంటూ ట్వట్ చేశారు. ఎవనిపాలయ్యిందిరో తెలంగాణ...!! అంటూ రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.