ఏ తెలంగాణ బయోగ్రఫీ అనే డాక్యుమెంటరీని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇవాళ(నవంబర్ 17) విడుదల చేశారు. తెలంగాణ ఆత్మఘోష, పదేండ్ల వేదన, రైతు, యువత, మహిళా మనోభావాలు అనే అంశాలతో దీనిని రూపొందించారు. ఈ సందర్భం గా మాట్లాడిన రేవంత్ రెడ్డి.. ఇది కేవలం తనకో, కాంగ్రెస్ పార్టీకో సంబంధించినది కాదని ప్రతీ తెలంగాణ బిడ్డ చూడాల్సిన ఆత్మకథ అని పేర్కొన్నారు.
అందుకే ఏ తెలంగాణ బయోగ్రఫీ అని పేరు పెట్టారని ప్రశంసించారు. తెలంగాణ మీద అక్కరతో... ప్రజల ఆవేదన చూసి ఈ డాక్యుమెంటరీ నిర్మించినట్టు నిర్మాతలు చిలుక విహాన్ రెడ్డి, చిలుక అయాన్డ్, బొంగునూరి కిషోర్ రెడ్డి తెలిపారు. విన్ స్పైర్ స్ట్రాటజీస్ కాన్సెప్ట్, క్రియేటివ్ బృందం ఈ డాక్యుమెంటరీని చిత్రీ కరించింది.