తెలంగాణకు సీఎంగా రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్న రేవంత్ రెడ్డి తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఢిల్లీలో ఉన్న రేవంత్.. పార్లమెంట్‌కు వెళ్లారు. అక్కడ తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. అలాగే, పార్లమెంటులో ఎంపీలను కలిశారు.
రూమ్ నెంబర్-66లో పలు పార్టీల ఎంపీలతో రేవంత్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు రేవంత్‌కు శుభాకాంక్షలు తెలిపారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో మాల్కజిగిరి నుంచి ఎంపీగా గెలిచారు రేవంత్. తాజాగా తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు.