- మీ భూములు కాపాడేందుకే నేనొచ్చిన
- ఓటుకు పది వేలిచ్చి గెలవాలని చూస్తున్నడు.. మీరిచ్చే తీర్పే తెలంగాణ అభివృద్ధికి పునాది
- డిసెంబర్ 9న మా ప్రభుత్వంఏర్పడగానే, 10న రైతుబంధు వేస్తం
- వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేస్తం
- గల్ఫ్‌లో కార్మికులు చనిపోతే 10 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని హామీ
కామారెడ్డి, వెలుగు : సిరిసిల్ల, సిద్దిపేటను కాదని కామారెడ్డిలో కేసీఆర్ పోటీ చేయడం వెనుక పెద్ద కుట్ర ఉందని రేవంత్అన్నారు. కామారెడ్డిలోని భూములను కొల్లగొట్టేందుకే కేసీఆర్ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారని చెప్పారు. ‘‘మీరు ఆదమరిచి కేసీఆర్‌కు ఓటేస్తే, కోట్లాది రూపాయల విలువైన భూములను కబ్జా పెడ్తడు. ఇక్కడి ప్రజల భూములకు కంచె వేసి రక్షణ కల్పించేందుకే నేను కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్న. ఓటుకు పది వేలిచ్చి గెలవాలని కేసీఆర్ చూస్తున్నరు.
కానీ ఆయనను గెలిపిస్తే రూ.10 వేల కోట్ల విలువైన భూములను దోచుకుంటారు. అందరూ కలిసి కేసీఆర్‌ను ఓడించాలి. లేదంటే ఎవరి భూములు మిగలవు” అని అన్నారు. మంగళవారం కామారెడ్డి జిల్లా కేంద్రం, దోమకొండ, బీబీపేట మండల కేంద్రాల్లో నిర్వహించిన రోడ్ షోలు, కార్నర్‌మీటింగ్‌లలో రేవంత్ మాట్లాడారు. కేసీఆర్ మాటలు నమ్మి మోసపోవద్దన్నారు. ‘‘కామారెడ్డి ప్రజలు బాగా ఆలోచన చేసి ఓటు వేయాలి. మీరిచ్చే తీర్పు తెలంగాణ దశదిశను మారుస్తది.
మీరు వేయబోయే ఓటు తెలంగాణ అభివృద్ధికి పునాది అవుతుంది. మీరు కేసీఆర్‌కు వేయబోయే శిక్ష ఎలా ఉండాలంటే, భవిష్యత్‌లో ఎవరికైనా తెలంగాణను దోచుకోవాలనే ఆలోచన వస్తే వాళ్ల ప్యాంట్లు తడవాలె’’ అని అన్నారు. కామారెడ్డి ప్రజలు ఇవ్వబోయే తీర్పును యావత్‌దేశం నిశితంగా గమనిస్తోందన్నారు. కేసీఆర్.. తన అల్లుడికి సిద్దిపేట, కొడుక్కి సిరిసిల్లను పంచి పెట్టారని ఫైర్ అయ్యారు. ‘‘నిజామాబాద్‌లో కవితను ఓడగొట్టి, ప్రజలు ఆమె దుకాణం బంద్ చేశారు. ఇప్పుడు కేసీఆర్‌ను ఓడించేందుకు యావత్ప్రజానీకం సిద్ధమైంది” అని చెప్పారు.
డిసెంబర్ 9న ఇందిరమ్మ రాజ్యం
తెలంగాణలో డిసెంబర్ 9న ఇందిరమ్మ రాజ్యం ఏర్పడుతుందని రేవంత్ ధీమా వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం ఏర్పడగానే డిసెంబర్ 10న రైతులకు రైతుబంధు వేస్తామని చెప్పారు. ‘‘వైశ్యులను కేసీఆర్ మోసగించారు. మేం అధికారంలోకి వచ్చినంక వైశ్య కార్పొరేషన్ఏర్పాటు చేస్తాం. ఈ పదేండ్ల కాలంలో గల్ఫ్ కార్మికులు, బీడీ కార్మికులను కేసీఆర్పట్టించుకోలేదు. మేం అధికారంలోకి రాగానే గల్ఫ్‌కార్మికుల కోసం ప్రత్యేక సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తాం.
గల్ఫ్ లో ఎవరైనా ప్రమాదవశాత్తు చనిపోతే, ఆ కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయం అందిస్తాం. గల్ఫ్ కార్మికులు ఎదుర్కొనే సమస్యలు తెలుసుకుని, వాటి పరిష్కారం కోసం ప్రత్యేక విభాగం ఏర్పాటు చేస్తాం. పీఎఫ్కార్డుతో సంబంధం లేకుండా బీడీ కార్మికులందరికీ రూ.4 వేల పింఛన్ ఇస్తాం” అని హామీ ఇచ్చారు. తాము వచ్చినంక కామారెడ్డికి పరిశ్రమలు తీసుకొస్తామని.. హైదరాబాద్, నిజామాబాద్ రహదారిని పారిశ్రామిక కారిడార్‌గా ప్రకటిస్తామని చెప్పారు.