తెలంగాణలో ప్రజలు కోరుకున్న స్వేచ్ఛ, సామాజిక అభివృద్ధి జరగలేదు: రేవంత్రెడ్డి

సోనియా గాంధీ చొరవ వల్లే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని అన్నారు టీ పీసీసీ  అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. వెయ్యి మంది కేసీఆర్ లు వచ్చినా తెలంగాణ రాష్ట్రం రాకపోయేదని విమర్శించారు రేవంత్ రెడ్డి. స్వేచ్ఛ, సామాజిక అభివృద్ధిని తెలంగాణ ప్రజలు కోరుకున్నారని.. అభివృద్ధి కేసీఆర్ ఉక్కు పాదాల కింద నిలికిపోతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు పేదల సంక్షేమానికి ఉపయోగపడలేదని విమర్శించారు రేవంత్ రెడ్డి. 

Also Read :- తెలంగాణ యుద్ధం మొదలైంది

తెలంగాణలో ప్రజాస్వామ్యం స్పూర్తి లోపించిందన్నారు రేవంత్ రెడ్డి. కేసీఆర్ నియంత ముసుగు ఉన్న క్రిమినల్ పొలిటిషయన్ అని.. ఆయనను ఎదుర్కోవడం అంత ఈజీ కాదని రేవంత్ రెడ్డి అన్నారు. మేడిగడ్డ పిల్లర్లు కుంగిపోవడంతో ప్రాజెక్టుల నిర్మాణంలో సాంకేతిక లోపం ఉందని తేలింది. మేడిగడ్డ కుంగిపోవడంతోనే కేసీఆర్ పాపాల పుట్ట కదిలుతోందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ప్రాజెక్టుల లోపాలను తప్పు దోవ పట్టించేలా కేసులు నమోదు చేస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.