ఖమ్మం సభ నుంచే బీఆర్ఎస్ కు సమాధి కడ్తామన్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఖమ్మం గడ్డపై కారు గుర్తు ఉండదని.. బంగాళాఖాతంలో పడేస్తామన్నారు. ఖమ్మం జిల్లాలో పదికిపది సీట్లు గెలుస్తామన్నారు రేవంత్. ఈ సారి పువ్వాడ అజయ్ గెలవడం అసాధ్యమన్నారు . జూలై 2న ఖమ్మంలో జనగర్జన సభను విజయవంతం చేసి తీరుతామన్నారు. సభకు డబ్బులు కట్టి బస్సులు అడిగితే ఇవ్వట్లేదన్నారు. ఎవరు అడ్డుకున్నా తొక్కుకుంటూ సభకు రావాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు రేవంత్. ఇంటలిజెన్స్ అధికారులు వీడియోలు తీసి కేసీఆర్ కు పెట్టాలని చెప్పారు. జూలై 2న ఢిల్లీ ఖమ్మం వైపు చూస్తుందన్నారు.
ఖమ్మం జిల్లాకు భట్టి విక్రమార్క, రేణుక రెండు కళ్లని.. పొంగులేటి మూడో కన్ను అని అన్నారు రేవంత్. పొంగులేటికి వ్యాపారులున్నాయి కాబట్టి బీజేపీలో చేరుతారనుకున్నానని కానీ.. అభిమానులు, అనుచరుల కోరిక మేరకు కాంగ్రెస్ లో చేరుతున్నారని చెప్పారు రేవంత్. పొంగులేటి కాంగ్రెస్ లో చేరుతున్నారనే కేసీఆర్ ప్రగతి భవన్ నుంచి కదిలారని అన్నారు. భట్టి విక్రమార్కఆదిలాబాద్ నుంచి వెయ్యి కిలోమీటర్లు నడిచారని అందుకే కేసీఆర్ పోడు పట్టాలు పంపిణీ చేస్తున్నారని చెప్పారు.
ఈ గవర్న మెంటే శాంపిల్ గవర్నమెంట్ అని.. కేసీఆర్ ది ఆరంభ శూరత్వమన్నారు రేవంత్. సోనియా గాంధీ పుట్టిన రోజున తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందని.. మరో పదేళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉంటదన్నారు రేవంత్. అధికారంలోకి రాగానే నూటికి నూరుపాళ్లు ధరణి పోర్టల్ ను రద్దు చేస్తామన్నారు.