కరీంనగర్:ఆనాడు విద్యార్థులు, ఉద్యమకారులు ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రం సాధిస్తే ఇవాళ కేసీఆర్ అనుభవిస్తున్నాడు అని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపిం చారు. సీఎం కేసీఆర్ లక్ష కోట్లు, 10 వేల ఎకరాల భూములను సంపాదించుకున్నారు అని అన్నారు. పేదలకు డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇవ్వలేదు గానీ.. ఇసుకను దోచుకుంటున్న ఎమ్మెల్యే షిండే కు మద్దతు మాత్రం ఇస్తున్నాడని విమర్శించారు. ఇందిరమ్మ రాజ్యంలో కేసీఆర్ తప్పకుండా చర్లపల్లి జైలులో డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టిస్తానని అన్నారు.
తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న దళితులను సీఎం కేసీఆర్ విస్మరించారని ఆరోపించారు. రైతు బంధు పంపినీకి ఎన్నికల సంఘం దగ్గర కేసీఆర్ అనుమతి తీసుకుంటే నాకు ఎలాంటి అభ్యంతరం లేదని రేవంత్ రెడ్డి అన్నారు. అలాగే దళిత బంధు అమలుకు కేంద్ర ఎన్నికల సంఘం దగ్గర ఎందుకు అనుమతి తీసుకోడానికి అభ్యంతరం ఏమిటో చెప్పాలని నిలదీశారు రేవంత్ రెడ్డి.
రేపటి నుంచి దళితబంధు ఇవ్వాలని సీఎం కేసీఆర్ దిష్టి బొమ్మను దహనం చేయాలని దళితులను కోరారు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాగానే.. కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన 6 గ్యారంటీలను తప్పకుండా అమలు చేస్తామని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.